తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ఏఐసీసీ పదవులు ఆశించిన ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్థాపంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇప్పటికే ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్న సంగతి తెల్సిందే.