అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ ‘గబ్బర్ సింగ్’.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా.. శృతిహసన్ అందాలను ఆరబోతతో పాటు చక్కని నటనను కనబరిచింది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు.
అయితే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ బుధవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు హరీశ్ వెల్లడించారు. ఈ మేరకు ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అనే పాత పాటను ట్విటర్లో షేర్ చేసి తన ఆనందాన్ని తెలిపారు.