భారత రాజ్యాంగ నిర్మాత.. భారత రత్న బీఆర్ అంబేద్కర్ , మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
ఈ నెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరు నేతల జయంతి ఉత్సవాలను పండుగలా జరిగేలా ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.