ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన వైసీపీ ఓడిపోతే మొదటి బుల్లెట్ మహిళలకే తగులుతుందని వైసీపీ సీనియర్ నేత.. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుంటే మీ చేతిని మీరే నరుకున్నవారవుతారని ఆయన చెప్పారు. కొంగున డబ్బుంటేనే మీ వెంట భర్త ఉంటాడని హితవు పలికారు.
ప్రభుత్వం మహిళలకు సహాయం చేయడం కొందరికి ఇష్టం లేదు. వైసీపీ పోవాలని వారు చూస్తున్నారన్నారు. బాధ్యతలేని విమర్శలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలని సూచించారు.