మనకు పాలకూర మనకు కొత్తేం కాదు. పప్పులో వేసుకుంటాం. తాలింపు చేసుకుంటాం. తరచూ పాలకూర తింటే చర్మం అందంగా తయారవుతుంది. చర్మ కణాలు మృదుత్వాన్ని పొందుతాయి.
చర్మం పొడిబారడాన్ని, ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది. పాలకూరలోని మెగ్నీషియం, ఐరన్ జుట్టు రాలిపోకుండా చేస్తాయి. వెంట్రుకలు చిట్లడమూ తగ్గుతుంది.
జీర్ణవ్యవస్థకు సహకరించే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉదయం పూట గ్రీన్ జ్యూస్‌గా తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలకూర వల్ల కావల్సినంత ఫోలేట్ లభిస్తుంది. ఫలితంగా మెదడు ఎదుగుదల, పనితీరు మెరుగవుతాయి. అల్జీమర్స్ ప్రమాదాన్నీ తగ్గిస్తుంది. అయితే పాలకూరను అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పోగయ్యే ఆస్కారం ఉంది.