అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. 2006లో డేనియల్స్ తో ఎఫైర్ నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపెట్టకుండా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇదే ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అరెస్టు దాకా తీసుకొచ్చింది. ఈ ఆరోపణలు నిజమని న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ తేల్చింది. తాజా పరిణామాలను ట్రంప్ ఖండించారు. తనను కావాలనే వెంటాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ మద్దతు దారులు నిరసనలకు సిద్ధమవుతున్నారు.