తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బిగ్ బీ అమితాబచ్చన్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు కీలక సూచన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజలను నట్టేట ముంచుతున్న సంస్థలకు అడ్వర్ టైజ్మెంట్ ద్వారా సహకరించవద్దని ట్వీట్ చేశారు.
ముఖ్యంగా అమితాబ్ ఆమ్వేకు అంబాసిడర్ ఉండటంపై అప్రమత్తం చేశారు. ఇలాంటి సంస్థతో అనుబంధం కొనసాగించవద్దని హితవు పలికారు. కాగా ఇటీవల క్యూనెట్కు యాడ్ చేసిన సానియా మీర్జాకు సైతం సజ్జనార్ ఇదే సూచన చేశారు.