కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ లు అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే కన్నడిగుల తీర్పు పరిశీలిస్తే మాత్రం 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారం ఇచ్చిన సందర్భం లేదు. గత 38 ఏళ్లుగా అధికారం చేతులు మారుతూ వస్తోంది. దీంతో ఈసారి ఎన్నికల్లో హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా వేచి చూడాలి.