పశ్చిమ బెంగాల్ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సింగర్ గా మారారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటను కూడా పాడారు. పక్కన మ్యూజిక్ ప్లే చేస్తుండగా సీఎం మమతా పాటను పాడటం ఆసక్తిగా మారింది.
కొంతమంది కోరస్ ఇస్తుండగా సుమారు రెండు నిమిషాలపాటు బెంగాలీలో ఉన్న సాంగ్ను పాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరు చేయడం లేదని మమతా బెనర్జీ రెండు రోజుల దీక్షను చేపట్టారు.