దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి.
కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు 1,42,497 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు..
2,151 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. కాగా గత ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్ 28వ తేదీన 2,208 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.