తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్ బానో కేసు దోషుల్లో ఒకడైన శైలేష్ చిమన్ లాల్ భట్ నిన్న ఆదివారం ఓ కార్యక్రమంలో బహిరంగంగా బీజేపీ ఎంపీ .. ఎమ్మెల్యే లతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ ఫొటోను షేర్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘మహిళలపై సహించరాని నేరాలకు పాల్పడిన వారు స్వేచ్చగా తిరుగుతుంటే, న్యాయం చేయమని బాధితులు వేడుకోవాల్సిన స్థితికి చేరాం. ప్రజలు గమనిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. ఈ ఫొటోపై ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఫైరవుతున్నారు.
Bilkis Bano Rapist openly shares stage with BJP’s MPs and MLAs.
What have we become as a community that perpetrators of heinous crimes against women are being celebrated and given a platform while the victims plead for justice.
India is watching! https://t.co/D90SiH84fC
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 27, 2023