బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా ఈరోజు తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి గౌరవ బోథ్ శాసన సబ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయిన సందర్భంగా గ్రామస్తులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని డప్పులతో భారీ స్వాగతం పలికారు.
పార్టీ కార్యక్రమాలు ఏవి ఉన్న భారీ ఎత్తున హాజరయి విజయవంతం చేస్తామని కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు. సభలో పాల్గొని గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ గ్రామ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి చేర్చలన్నారు.
పార్టీ గురించి మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎవడైనా సరే వారి ప్రచారాలకు తిప్పి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డా. తోట వెంకటేష్, బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, RBS జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు మగ్గిడి ప్రకాష్ గార్లతో పాటు తదితరులు ఉన్నారు.