తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను టీఎస్పీఎస్సీ ముమ్మరం చేసింది. కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ఫోన్ లు, పెన్నులను తీసుకురాకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది.
అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఆన్ లైన్లో సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తయారుచేయనుంది. అన్ని పరీక్షలను ఆన్ లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.