అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 134 మంది పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన రూ.78,57,500/- ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు చింతల్ లోని కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేక మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు ఎమ్మెల్యే గారు చెప్పారు.
అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, దేవరకొండ శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, రవీందర్ ముదిరాజ్, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.