ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రూ.12,718 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యుత్ నియంత్రణ మండలికి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. 5ఏళ్లలో డిస్కంలకు ప్రభుత్వం ఈ డబ్బు చెల్లించనున్నారు..
దీనిపై బ్యాంక్ వడ్డీని కూడా చెల్లించనున్నారు. అలాగే ప్రార్థనా స్థలాలకు అందించే విద్యుత్ ఛార్జీలను యూనిట్కు గౌ5 చొప్పున మాత్రమే వసూలు చేయనున్నారు.