ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం 2026 సంవత్సరం అనంతరం జనాభా లెక్కలు పూర్తయిన తరువాతే నియోజకవర్గాల పునర్విభజన జరపవచ్చని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు.