సెర్ప్ ఉద్యోగులకు పే సేల్ వర్తింపజేస్తూ జీవో విడుదల చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లిలోని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న సెల్ఫ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎదురు చేస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలన ఉద్యోగుల బాధను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతాలను, సెర్ప్లోని ఒక్కో క్యాడర్ ఉద్యోగికి ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా వేతనం చెల్లించాలో ఉత్తర్వులు చారీ చేసి ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి తెస్తుంది..
స్వరాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను, ఆయా వర్గాల డిమాండ్లను పరిష్కరిస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.