ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వస్తారని వివరించారు.