తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు కోపం వచ్చింది. దీంతో ఏకంగా వార్నింగే ఇచ్చేశారు.
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ వలస పక్షుల్లారా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. ఎక్కువ మాట్లాడితే నాలుక కోసేస్తా అంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు.
ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. షర్మిల తనను విమర్శిస్తే ప్రజలే అడ్డుకున్నారని.. తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసేవారు ఎవరైనా దమ్ముంటే మహబూబాబాద్ లో చర్చకు రావాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ సవాల్ విసిరారు.