తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. వచ్చే నెలలో జరిగే టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
పదో తరగతి హాల్టికెట్లు విడుదల www.bse.telangana.gov.in వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై HM సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. ఈసారి 4.94 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. 2,652 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.