కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఒకరికి , గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన ముగ్గురి లబ్దిదారులకు 4,00,464 రూపాయల విలువచేసే కల్యాణ లక్ష్మి చెక్కులను హనుమకొండలోని వారి నివాసంలో అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాల ద్వారా ఒక లక్షా నూటపదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారని తెలిపారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైనా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.