భారతదేశంలో నాలుగున్నర నెలల తర్వాత అంటే దాదాపు 140 రోజుల తర్వాత భారీగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 1,300 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 కు చేరింది.