ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దొంగ హామీలు ఇచ్చారు..
అందుకే ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో చిత్తుగా పట్టభద్రులు ఓడించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఒక్క రూపాయితో ఐదు లక్షల విలువైన ఇల్లు కట్టిస్తానని చెప్పి సీఎం జగన్ పేదలను మోసం చేశారన్నారు.
టిడ్కో ఇళ్లు పూర్తయినా నాలుగేళ్లు నుంచి లబ్ధిదారులలకు ఇవ్వకుండా సైకోలా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై దాడి చేస్తే సైకోలా జగన్ నవ్వుతున్నారన్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని… దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం అని చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు.