తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు.
ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.