దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరింది.