కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 28వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా అంగడి పేట్, జీడిమెట్ల గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, బస్తీ దవాఖన తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా అంగడి పేట్ లో మిగిలి ఉన్న మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, కరెంటు స్తంభాలు, కమిటీ హాల్, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలు, జీడిమెట్ల గ్రామంలో మిగిలి ఉన్న అంతర్గత సీసీ రోడ్లు, స్మశానవాటిక అభివృద్ధి, కమిటీ హాల్, ప్రాథమిక పాఠశాలలో అదనంగా నాలుగు గదులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
కాగా ఎమ్మెల్యే గారు తక్షణమే అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా పనులు త్వరలోనే పూర్తి చేయాలన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఈఈ భాను చందర్, ఏఈ సురేందర్ నాయక్, డిజీఎం రాజేష్, మేనేజర్ రాజు, లైన్ మెన్ కిరణ్, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్, బీరప్ప, కాలే నాగేష్, నరేందర్ రెడ్డి, పులి మహేష్, ఆర్.శ్రీనివాస్ గౌడ్, కాలే గణేష్, నదీమ్ రాయ్, కవిత గౌడ్, పద్మ, పల్లవి, విజయ, పులి యాదగిరి గౌడ్, అశోక్ గౌడ్, శ్రీధర్ గౌడ్, మల్లా గౌడ్, అనిల్, సత్యనారాయణ, దావూద్, నరసింహస్వామి, పవన్, వెంకటేష్, నరేష్, విజయ్ హరీష్, ప్రసాద్, అశోక్, బాల మల్లేష్, సాయిబాబా, గొరిగే అరుణ్, నరేష్, కుమార్, మల్లేష్, మధు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.