తెలంగాణ రాష్ట్ర సీఎం,బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి గంగుల కమలాకర్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే అని ఉద్ఘాటించారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే అని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవరర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులకు, తెలుగు ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.