Latest Rains తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన నుంచి రైతులకు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోని రైతులకు లేని సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు కల్పించింది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతుల జీవితాల్లో ఆనందాన్ని నిలిపింది. ముఖ్యంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణలో ప్రతి రైతు కష్టానికి ఫలితం దక్కుతుంది. కాగా భారీ వర్షాలపై ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.
తాజాగా కురిసిన వర్షాలు తెలంగాణలో రైతులకు పంట నష్టం కలగగా వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించినత వరకూ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని వర్షానికి సంబంధించి నాలుగు రోజులు ముందు నుంచే ప్రభుత్వం రైతులందరినీ అప్రమత్తం చేసిందని ప్రస్తుతం వారికి వున్న సమస్యలను తొలగించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రమంతా అధికారులు పర్యటన చేసి నష్టాన్ని అంచనా వేస్తున్నారని తాను కూడా వికారాబాద్ జిల్లాలో పర్యటించి రైతుల యొక్క సమస్యలు తెలుసుకున్నానని దీనిపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు ఎంత మాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే దీక్షలను ప్రజలు నమ్మబోరని వారు ప్రభుత్వం కృషిని గుర్తుపెట్టుకుంటారని అందువలన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు గట్టిగా సూచించారు.