Minister Roja ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికలలో 175 స్థానాలకు గాను 150 యొక్క స్థానాల్లో వైయస్సార్ పార్టీ జై కేతన ఎగరవేసి అధికారాన్ని చేపట్టింది. ప్రతిపక్ష టిడిపికి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా దాదాపు 90% స్థానాలు వైయస్సార్ పార్టీ గెలిచింది. అప్పటినుంచి కూడా వైయస్సార్ పార్టీ దాదాపు జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తూనే వస్తుంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ దాదాపు ఎన్నికల జరిగిన.అన్నిచోట్ల గెలిచింది. కానీ ప్రతిపక్ష టిడిపి మాత్రం వైయస్సార్ పార్టీ పులివెందులలో ఓడిపోయిందంటూ ప్రచారం చేస్తుంది. తాజాగా దీనిపై పర్యట శాఖమంత్రి అయిన ఆర్కే రోజా స్పందించారు.
ప్రతిపక్ష టిడిపి వైయస్సార్ పార్టీ పులివెందులలో ఓడిపోయిందంటూ ప్రచారం చేస్తుంది. ఈ మేరకు మంత్రి రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి పులివెందులలో జగన్ ఓడిపోయారంటూ ప్రచారం చేస్తున్నారని.. పులివెందుల ప్రజలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారని ఆయనను పులివెందులలో ఓడించే మగాడు ఇంకా పుట్టలేదని కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య వాక్యాన్ని తిప్పికొట్టారు గతంలో కూడా ఎన్నోసార్లు తమ ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేసిందని కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచి పనులతో అవి ఏవి ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ మరొక మారు చరిత్ర సృష్టించింది. దాదాపు ఎన్నికలు జరిగిన అన్ని స్థానాల్లోని జై కేతనం ఎగురవేసిన 2024లో మరొకసారి అధికారాన్ని చేపట్టబోతున్నట్టు ప్రజలకు విపక్ష పార్టీలకు సూచనలు పంపించింది.