Brs Party తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా సంక్షేమ లక్ష్యంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా ప్రజలందరి సమస్యలను తీర్చడమే తన యొక్క లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. 2014లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణ అభివృద్ధిని దేశమంతా చూసి తెలంగాణ అభివృద్ధి మోడల్ ని వారు కూడా అనుసరిస్తున్నారు. 2018 లో మరొకసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ తెలంగాణలో తనకు ఎదురే లేదు అన్నట్లుగా ప్రజా మద్దతు పొంది ముందుకు కొనసాగుతున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ పార్టీగా నామకరణం చేసి దేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించే ప్రయత్నంలో ఉన్న బిఆర్ఎస్ తాజాగా మరొక అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తోంది తన పార్టీని ఏపీ, ఒరిస్సాలో స్థాపించి ప్రజల అభిమానాన్ని సంపాదించారు. తాజాగా ఆయన మహారాష్ట్రలో భారీ సభను ఏర్పాటుచేసి బిఆర్ ఎస్ పార్టీని జాతీయపరంగా ముందుకు తీసుకు వెళ్ళనున్నారు. ఈనెల 26 వ తారీఖున మహారాష్ట్రలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
బిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆసన్న జీవన్ రెడ్డి ఆధ్వర్యం లో మహారాష్ట్రలో భారీ ఎత్తున సభ జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. కాగ ప్రస్తుతం ఆ పార్టీ ప్రతినిధులు అంతా మహారాష్ట్రలోనే ఉంటూ ఈ కార్యక్రమంలో చూసుకుంటున్నట్టు తెలుస్తోంది ఏ విధంగా అభివృద్ధి చేశారు అదేవిధంగా దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని కెసిఆర్ చెబుతున్నట్టు తెలుస్తోంది.