Ap Assembly ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజారిటీతో వైయస్సార్ పార్టీని గెలిపించిన నుంచి ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రాన్ని సజావుగా జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకు వెళుతున్నారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆయన తీసుకుంటుంటే ప్రతి నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన వంతు పాత్రకి న్యాయం చేయలేకపోతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన ఎందుకు నిదర్శనంగా మారింది.
కాగా అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలు ప్రతిపక్షంగా తెలుగుదేశం ఓడిపోతుందని కళ్ళకు కడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వంతో చర్చించి వాటి పరిష్కారానికి తన వంతు పాత్రను పోషించాలి.. కానీ అలా చేయకుండా వ్యతిరేకంగా వీరు అనుసరిస్తున్న తీరుపై తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు ఎక్కువగా వెళ్లి గట్టిగా అరవడంతో సమస్యలు అన్ని మరుగున పడుతున్నాయని ఎంతో విలువైన సమయం వృధా అవుతుందని స్పీకర్ మండిపడ్డారు. ఈ విషయాన్ని మార్చుకోవాలని అధికార ప్రతిపక్షాలు స్పీకర్‌కు సహకరించి సభను ముందుకు వెళ్లే విధంగా చేయాలని చెప్పారు. ఇలా కాకుండా ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన ఎన్నో విషయాలు ఎందుకు నిదర్శనం గా మారాయని మళ్లీమళ్లీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని గట్టిగా చెప్పుకొచ్చారు..