బాలీవుడ్ కు చెందిన హాటేస్ట్ హీరోయిన్ పాయల్ ఘోష్ ఓ ప్రముఖ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో నెటిజన్ ల ట్రోల్స్ పై స్పందించిన నటి పాయల్ ఘోష్ ఓ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈక్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెబుతూ ఉత్తరాదికి చెందిన దర్శకుడు అనురాగ్ కశ్యాప్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆయనతో పని చేయకుండానే ఓ మీటింగ్ లో తనను రేప్ చేశాడంటూ ఆరోపించింది.
సౌత్ ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర దర్శకులతోపాటు స్టార్ హీరో తారక్ తో కూడా పని చేశాను. కానీ, ఎవరూ నాతో అనుచితంగా ప్రవర్తించలేదంటూ ఆమె మండిపడింది.