ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగున్న శ్రీధర్ ఎన్ఎండీసీ చైర్మన్ గా నియామకమయ్యారు. 1997 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీధర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు.
ఏపీలో రాజమండ్రి సబ్ కలెక్టర్, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్ డైరెక్టర్ గా కాకినాడలో పని చేశారు. అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2015 నుంచి సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీధర్.