తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724% డీఏ మంజూరు చేస్తూ ట్రాన్ స్కో సీఎండీ ప్రభాకర్ ఉత్తర్వులిచ్చారు.
గతేడాది జులై 1 నుంచి 28.638 శాతం డీఏ చెల్లిస్తుంది.. ఈ ఏడాది జనవరి నుంచి 32.362 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను మార్చినెల జీతంతో కలిపి ఏప్రిల్ నెలలో చెల్లించనున్నట్లు వెల్లడించారు.