MLC Kavith తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం దృష్టి ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టిందని వారికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అందాల్సిన న్యాయం అందుతుందని ఎక్కడా ఏ విధమైన వివక్షత లేదని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మగవారితో సమానంగా స్త్రీలు కూడా సమాన అవకాశాలు అందుతున్నాయని అందువలన స్త్రీలు వారి ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లడానికి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని చెప్పుకొచ్చారు.
తాజాగా బీఅర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాత అనేకమైన గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని అందువల్లనే తాము చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటం కోసం రిజర్వేషన్లు ప్రత్యేకంగా కల్పించాలని కోరుతున్నామని ఆమె తెలిపారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో చట్టసభలలో మహిళలకు ప్రాధాన్యం అంతగా లభించడం లేదని వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుందని ఈ విషయంపై తాము అనుకున్న లక్ష్యం నెరవేరే దాకా పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
తాజాగా కవిత రష్యన్ ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె 1996 లోని దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళల రిజర్వేషన్లు కోసం ప్రత్యేకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టారని కానీ ఇప్పటివరకు చట్ట రూపం దాల్చలేదని ఆమె పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమాన అవకాశాలు పొందాలని వారి జీవితంలో ఉన్నత రంగంలో వారు అభివృద్ధి చెందాలని ఆమె కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఈ విషయంపై పోరాటం చేస్తూ ఉంటారని ఆమె స్పష్టం చేశారు.