skoch awards ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఏ చిన్న పథకాన్ని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. సన్నకారు రైతులు, చిన్న రైతులు మొదలగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ధైర్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా పేద రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు. కాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన పథకాలకు జాతీయస్థాయిలో అవార్డులు లభించాయి. రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు జాతీయస్థాయిలో అవార్డులు లభించాయి.
కాగా వ్యవసాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన తొలి పథకాలకు జాతీయస్థాయిలో అవార్డులు లభించాయి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు 2023 24నకు సంవత్సరానికి సంబంధించి స్కాచ్ అవార్డుల పంట పండింది. వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవాదారులకు సిల్వర్స్కోచ్ అవార్డు లభించింది. వెటర్నరీ మెడిసిన్ కాల్ సెంటర్కు పశు వ్యాధుల నిర్ధారణ ల్యాబ్స్ ఆంధ్ర గోపుస్తి కేంద్రాలకు కోచ్ మెరిట్ అవార్డులు లభించాయి.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు జాతీయస్థాయిలో ఈ విధమైనటువంటి అవార్డులు రావడం ఎంతో ఆనందాన్ని ఎంతో భరోసాని రైతులకు కలిగిస్తుందని పశువర్ధక శాఖ డైరెక్టర్ అయిన అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు, రైతులకు సంక్షేమం దృష్ట ప్రవేశపెట్టిన పథకాలనేవి ఎంతో లాభాన్ని రైతులకు చేకూర్చాలని వారు వాటిని చక్కగా వినియోగించుకొని తమ జీవితాన్ని బాగుపరచుకున్నారని ఆయన పేర్కొన్నారు.