Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం ద్వారా దేశమంతటి చూపును రాష్ట్రంపై పడేలా చేశారు.
తాజాగా రాజస్థాన్ కు చెందిన ఉన్నతాధికారుల బృందం గొల్లపూడిలో ఉన్న ఆర్ వి కె కేంద్రాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం అద్భుతం అని కొనియాడింది. దేశం మొత్తం మీద ఎక్కడా ఇటువంటి విధానం లేదని ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉందని దీని వలన రైతులు ఎంతో లాభం పొందుతున్నారని రాజస్థాన్ ఉన్నత అధికారుల బృందం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని తాము రాజస్థాన్లో కూడా పెట్టాలనుకున్నట్టు భావిస్తున్నామని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని వారు పేర్కొన్నారు.
కాగా ఈ ఒక్క రైతు భరోసా కేంద్రం ద్వారా మాత్రమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలను దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు గుర్తించి వారి రాష్ట్రంలో కూడా అమలుపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవే కాకుండా వైయస్సార్ రైతు భరోసా, చేయూత, మహిళలకు అధిక మొత్తంలో రుణాలు, విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న, గోరుముద్ద, విద్యా కానుక వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరి యొక్క సమస్యలను పరిష్కరించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి.