Group 1 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు, ప్రతిభావంతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దృష్ట్యా ఈ విషయంపై విచారణ జరిపినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. రద్దు చేసిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న మరల నిర్వ నిర్వహించబోతున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలియజేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ అర్హతకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై నిరుద్యోగ యువత, అర్హులైనటువంటి ప్రతిభావంతులు తమ ఆందోళన వెల్లబుచ్చారు. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏఈ, టిపిబి ఓవెటర్ని అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై విద్యార్థులందరూ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే పరీక్షలు రద్దు అవ్వటంతో తామంతా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామంటూ ఎన్నోఏలుగా ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నామని ఇప్పుడు తమ భవిష్యత్తు ఏంటి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణలోకి తీసుకుంటూ వంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తె గ్రూప్ వన్, ఏఈఈ, డిఎఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కఠినమైన చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.