Ys Jagan ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి నాయి బ్రాహ్మణ సంఘం యొక్క పెద్దలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే సామాజిక న్యాయం కల్పించగా వైఎస్సార్సీ ప్రభుత్వం అన్ని రకాల ప్రజలకు సమన్యాయం సామాజిక సాధికారత రెండిటిని కల్పిస్తుంది. అందువలన తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం స్థానాలలో జై కేతనం ఎగురవేసి క్లీన్ షిప్ చేసి ప్రజల యొక్క ఆదరణ తమ వైపే ఉందని మరొకసారి నిరూపించింది
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులకు శుభవార్తను అందజేసింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలకు కనీసం 20 వేల రూపాయలు చొప్పున జీతం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ విషయానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసింది. కేశఖండన సాలలో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు జరిగేటటువంటి ఆలయాలలో ఇది వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
ఒకవేళ నాయి బ్రాహ్మణులకు 20 వేల కంటే తక్కువ జీతం లభిస్తే వారికి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీతం అందించేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొక నిర్ణయం కూడా తీసుకుంది. వారికి 20వేల రూపాయల కంటే తక్కువ జీతం లభిస్తే భక్తులు కేశఖండనశాలలో తలానీరాలు సమర్పించేటప్పుడు ఇచ్చేటటువంటి టికెట్టు రుసుము ద్వారా వచ్చే ఆదాయం నుంచి వారికి జీతం చెల్లించేటట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.