ఏపీ లో ఈరోజు గురువారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపొందినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ తరపున నర్తు రామారావు గెలుపొందారు.
వైసీపీ అభ్యర్థి అయిన నర్తు రామారావు కు ఆరు వందల ముప్పై రెండు ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట ఎనిమిది ఓట్లు పడ్డాయి. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి మధుసూదన్ కు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు. స్వతంత్ర అభ్యర్థులైన వేణుగోపాల్ కు పది .. మోహన్ రెడ్డికి ఎనబై ఐదు ఓట్లు పడ్డాయి.
దీంతో కర్నూలు నుండి మధుసూదన్ గెలుపొందారు.పశ్చిమ గోదావరి జిల్లా నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవురు శ్రీనివాస్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్ కు నాలుగోందల ఎనబై ఒక్క ఓట్లు పడగా తన సమీప ప్రత్యర్థి అయిన చంద్రశేఖర్ కు నూట ఇరవై రెండు ఓట్లు పడ్డాయి.మరోవైపు రెండో స్థానానికి బరిలోకి దిగిన వైసీపీ అభ్యర్థి వంకా రవీంద్ర స్వతంత్ర అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. రవీంద్రకు నాలుగు వందల అరవై ఓట్లు పడగా.. స్వతంత్ర అభ్యర్థికి నూట ఇరవై రెండు ఓట్లు పడ్డాయి.