Telengana Rains తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ ఈ మేరకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ముందు ముందు ఈ వర్షాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర దక్షిణ ధోని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ లో గురువారం పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడినట్టు చెప్పుకొచ్చింది..
వర్షాలు పడనున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరింజలట్టును జారీ చేసింది.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది. అలాగే పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే జిహెచ్ఎంసి ప్రాంతాల్లో వడగలు వాన ఇప్పటికే కురిసింది అని ఈ ప్రాంతాలు లో ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే ఈరోజు హైదరాబాద్ నగరం అంతా వర్షం పడినట్టు తెలుస్తోంది.