Brs Mlc Kavitha బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాది సోమ భారత్ చట్ట ప్రకారం విచారణ జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు.
ఎమ్మెల్సీ కవిత ఈడి విచారణను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చట్ట ప్రకారం విచారణ జరగలేదని చెప్పుకొచ్చారు. అలాగే ఈడి ఆఫీస్ కి వెళ్లిన ఆయన వాళ్ళు అడిగిన 12 రకాల డాక్యుమెంట్లను వాళ్లకు సమర్పించినట్టు తెలుపుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భరత్ చట్ట ప్రకారం విచారణ జరగట్లేదు అక్రమంగా కవిత ఫోను తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామని తీర్పుకు అనుకూలంగా తమ నడుచుకుంటామని అన్నారు. మహిళలను ఇంటి దగ్గరే విచారించాలని ఆఫీసుకు రావాలని సమన్లు ఇచ్చే పవర్స్ ఈడికి లేవని తెలిపారు.
ఇంటికి వచ్చి విచారించాలని కోరే హక్కు మహిళలకు ఉందని గుర్తు చేసిన భరత్ తమ హక్కులు సాధించడానికి సుప్రీంకోర్టులో రిప్పిటిషన్ వేసామని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి మహిళా నేతలను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సరైన పద్ధతి అంటూ ప్రశ్నించారు. ఈడి విచారణకు హాజరుకామని తాము ఎప్పుడో చెప్పలేదని కానీ చట్ట ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. అయితే ఈ డి పై వేసిన పిటీషన్ ఈనెల 24వ తేదీన సుప్రీంకోర్టు విచారించని ఉందని కచ్చితంగా సుప్రీమ్ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని అన్నారు..