అనేక సంవత్సరాలుగా సమస్యలలో ఉండి సరైన ధ్రువపత్రాలు లేని వారు హక్కులు లేని వారి ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పట్టాలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. కల్లూరులో జీవో 58, 59 ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పంపిణీ చేశారు. 120 గజాల లోపు భూమిని నిరుపేదలు జీవో 58 ద్వారా హక్కులు పొందవచ్చునని అన్నారు. రుణాలు కూడా పొందవచ్చునన్నారు. అనేక ఏళ్లుగా ఇబ్బందులను మేమంతా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
కట్ ఆఫ్ తేదీ గతంలో 2014 తేదీ ఉండగా దానిని 2020 కి పెంచి ఊరటనిచ్చిందని అన్నారు. 120 గజాలకు మించి ప్రభుత్వం నిర్ణయించిన వారికి జీవో 59 మేరకు దరఖాస్తులు చేసుకోన్న వారికి వర్తిస్తుందని అన్నారు. ఈ రెండు 58, 59జీవోలను ప్రభుత్వం పొడిగించిందన్నారు. 58 కింద 452, 59కింద 1361 మంది దరఖాస్తులు చేసుకోగా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించారన్నారు. స్వార్ధంకోసం నిరుపేదలను రెచ్చగొట్టి ఉసి గొల్పుతున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా డ్రా సిస్టం ద్వారా పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇస్తుందని చెప్పారు.
ఇతర మండలాల అధికారులు వచ్చి విచారణ చేసి అసలైన నిరుపేద లబ్ధిదారులను గుర్తించారన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి ఆందోళన చేస్తున్న వారికి ఇళ్లను కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ డబ్బుతో నిర్మితమైన ఇళ్లపై మా జోక్యం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారన్నారు. రాజకీయ విలువలు లేని వారు తప్పుడు పద్దతులలో ఆందోళనలు చేస్తున్నారని, వారంతా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అందోళన చేస్తున్న వారిలో ఇళ్లు పొందలేని వారికి న్యాయబద్ధంగా వస్తాయని, రూ.3లక్షల పథకంలో స్పెషల్ కోటాలో ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఉన్న సమయంలో జెసిబిలు, ప్రొక్లేయన్స్ తో కులగొట్టే ప్రయత్నం చేయడం, పేదలను భయ పెట్టడం చేసిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవన్నారు. అనంతరం టీఎన్జీవోస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.