తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 21వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. చర్చ్ గాగిల్లాపూర్ రాజీవ్ గాంధీనగర్ (214), చైతన్య నగర్ కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు.
కాగా మంచినీటి సౌకర్యం, భూగర్భ డ్రైనేజీ, నూతనంగా సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేదలకు 58 జీవో కింద పట్టాలు అందేలా కృషి చేస్తానన్నారు. అదే విధంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు తెలిపి లబ్ధి పొందేలా చూడాలని నాయకులకు ఎమ్మెల్యే గారు సూచించారు.
నిధులకు ఏ మాత్రం కొరత లేదని.. గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి సహకారంతో ఎన్ని నిధులైనా వెచ్చించి దుండిగల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్, దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు జోసిఫిన్ సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, సీనియర్ నాయకులు నాగరాజు, జైరాజ్ రెడ్డి, చెవిటి మురళి, జగన్ నాయక్, కుంటి మురళి, జహంగీర్, బాలయోగి, రాజు, కరీమ బేగం, భారతి, హసీనా, మత్యాస్ రెడ్డి, తేజ, సారధి, సాయి బాబా, సతీష్, సంతోష్, ప్రవీణ్ నాయక్, మురళి తదితరులు పాల్గొన్నారు.