ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు విచారించారు. కాగా, ఈ కేసులో ఆయనను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.