తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సోమవారం జన్మదిన వేడుకలు నిర్వహించుకున్న సంగతి తెల్సిందే.
అయితే ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ఆమెను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల రవి ఆధ్వర్యంలో ప్రతినిధులు రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కట్ల శ్రీను, మండల అంజిబాబు, మనీపెద్ది మహేష్ పాల్గొన్నారు.