తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల అయిన ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల మరియు బీసీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.
కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్సీఐ.. ధాన్యం కొనుగోళ్లకు సహకరించకున్నా ఆ సంస్థతో సంబంధం లేకుండా యాసంగిలో పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి గంగుల కమలాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,060 చొప్పున సేకరిస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను మంత్రి గంగుల ఆదేశించారు.