తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల్లో కంటి సమస్యలు ఉన్నవారందరికీ పరీక్షలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70 లక్షల మందికి కంటి పరీక్షలు పూర్తయినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 4,565 గ్రామాల్లో, 1616 మున్సిపల్ వార్డుల్లో క్యాంపులు నిర్వహించామని మంత్రి హారీష్ ఈ సందర్భంగా వివరించారు.
క్యాంపులలో పరీక్షలు చేయించుకున్నవారికి అవసరమైన వారందరికీ ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.