తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి నిర్వచనం అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బొడ్రాయి ఐదో వార్షికోత్సవం సందర్భంగా జలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.అనంతరం బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ పార్ట్ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, పిఎస్ఎస్ సొసైటీ చైర్మన్ ఆవుల రామారావు, టిఆర్ఎస్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, వెంపటి మధుసూదన్, పైడిమర్రి నారాయణరావు, పైడిమర్రి వెంకటనారాయణ, రామినేని శ్రీనివాసరావు, పట్టణ కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, మేదర లలిత, బెజవాడ శిరీష శ్రవణ్, ఫాతిమా కాజా, సాదిక్, టిఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్,బత్తుల ఉపేందర్, గంధం పాండు,సన్నీరు మురళి, నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.