Cm Kcr తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అర్ఆర్ఆర్ సినిమా లో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలుగు మట్టికి దొరికిన అరుదైన గౌరవం అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఇది శుభవార్త అంటూ తెలిపారు.
అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు మాట ఆస్కార్ అవార్డును తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్ను గెలుచుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు చిత్ర పరిశ్రమ జయకేతనాన్ని ఎగరవేసిందని చెప్పుకొచ్చారు..
ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తెలుగు సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం అందరికీ గర్వకారణం అని అన్నారు. ఈ పాటలో పొందుపరిచిన పదాలు తెలంగాణ సంస్కృతి , తెలుగు ప్రజల అభిరుచికి అద్దం పడుతున్నాయని చెప్పుకొచ్చారు.. అలాగే తెలంగాణ బిడ్డ చంద్రబోస్ ఈ పాటలో తెలుగు భాషను గొప్పగా వర్ణించారని తెలిపారు. అలాగే ఈ పాట కోర్టులో భాగస్వాములైన ఎం ఎం కీరవాణి కి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా గాయకులైన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్, నిర్మాత దానయ్యకు కూడా శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్.. ఈ సినిమా నిర్మాణరంగం పరంగా హాలీవుడ్కు ఏమాత్రం తీసిపోదని చెప్పుకొచ్చిన కేసీఆర్ ముందు ముందు తెలుగు చత్రపతి శ్రమ మరింత ముందుకు వెళ్లాలని మరిన్ని అవార్డులు గెలుచుకోవాలని అన్నారు.